సలార్ విలన్ రోల్.. సేతుపతి ఏమన్నాడంటే?

salaar

ఒక బిగ్ బడ్జెట్ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ముందే రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెట్స్ పైకి వచ్చాక కూడా గాసిప్స్ డోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. సలార్ సినిమాపై కూడా రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఇటీవల లాంచ్ అయిన విషయం తెలిసిందే.

vijay sethupathi as ltte prabhakaran in a new web series

అసలు విషయంలోకి వెళితే సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. మాస్టర్ సినిమా అత్యదిక కలెక్షన్స్ అందుకోవడానికి ప్రధానం కారణం సేతుపతి చేసిన విలన్ రోల్ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో అతని నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అనంతరం సలార్ లో కూడా సేతుపతి విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్లు టాక్ వచ్చింది.

ఇక ఆ టాక్ విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్లడంతో అతను కుండబద్దలు కొట్టేశాడు. ఇంతవరకు అలాంటి ఆఫర్ తన వద్దకు రాలేదని అంటూ సలార్ సినిమాకు సంబంధించిన వారు ఎవరు కూడా తనను సంప్రధించలేదని సేతుపతి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అంటే చిత్ర యూనిట్ కేవలం చర్చల్లోనే ఉందా లేక మరొకరిని సంప్రదించే ఆలోచనలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే.