డబ్బులెక్కడినుంచి వస్తున్నాయ్ విజయ్.?

మాట నిలబెట్టుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ‘ఖుషీ’ సినిమాకి సంబంధించి తన సంపాదన నుంచి ఏకంగా కోటి రూపాయల్ని, వంద మందికి లక్ష రూపాయల చొప్పున అందించాడు.

తెలుగు సినీ పరిశ్రమలో ఇది చాలామందికి పెద్ద షాకింగ్ వ్యవహారం.! సినీ ప్రముఖులు, సేవా కార్యక్రమాలు చేయడం కొత్త కాదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, విద్యా సంబంధిత అవసరాల నిమిత్తం సతమతమవుతున్నవారు.. ఎలాగోలా సినీ ప్రముఖుల్ని సంప్రదిస్తుంటారు.. కొందరు వారికి సాయం చేస్తుంటారు కూడా.

కానీ, విజయ్ దేవరకొండలా.. ఒకేసారి వంద మందికి లక్ష రూపాయల చొప్పున మొత్తంగా కోటి రూపాయల సాయం చేయడమంటే సమ్‌థింగ్ స్పెషల్. అది కూడా, ఓ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసే క్రమంలో, ఆ ఆనందాన్ని వంద కుటుంబాలతో పంచుకోవాలనుకోవడం గొప్ప విషయమే కదా.!

ఇక్కడితో అయిపోలేదు, ముందు ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించడానికి ప్రయత్నిస్తానంటున్నాడు విజయ్. కానీ, సాధ్యమయ్యే పనేనా.? అసలు ఇన్ని డబ్బులు విజయ్‌కి ఎలా వస్తున్నాయ్.?

డబ్బుల సంగతి సరే, దీన్ని ఆర్గనైజ్ చేయడం పెద్ద టాస్క్.! చూస్తోంటే, విజయ్ పెద్ద స్కెచ్ రెడీ చేసుకున్నట్టున్నాడనిపించకమానదు.