రౌడీ బాయ్ దున్నేస్తున్నాడు.. ఎవ‌రికి ద‌క్క‌ని రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్న యూత్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చేసింది కొన్నే సినిమాలే అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరో స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ ఫేట్‌ని పూర్తి చేసింది. ఈ సినిమాతో మ‌నోడి క్రేజ్ ఎక్క‌డికో వెళ్లింది. తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల‌లోను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజ‌య్ న‌టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే స‌రికి విజ‌య్ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆయ‌న పేరు చెబితే నార్త్ ప్రేక్ష‌కులు కూడా ఇట్టే గుర్తుప‌డుతున్నారు.

అర్జున్ రెడ్డి త‌ర్వాత గీతా గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టాడు విజ‌య్. ఈ సినిమా త‌ర్వాత ఒక్క హిట్ అత‌నిని ప‌ల‌క‌రించ‌క‌పోయినప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌లో క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. కేవ‌లం సినిమాల‌తోనే కాక సోష‌ల్ స‌ర్వీస్‌తోను రౌడీబాయ్ అంద‌రి అభిమానాన్ని దక్కించుకున్నాడు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ రోజురోజుకు త‌న అభిమాన గ‌ణాన్ని ద‌క్కించుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని ఇన్‌స్టాగ్రామ్ 10 మిలియ‌న్ మార్క్ చేరుకోగా, ఈ ఘ‌న‌త సాధించిన తొలి ద‌క్షిణ భార‌తీయ న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నిలిచాడు. మ‌హేశ్‌బాబు 6.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, అల్లు అర్జున్ 9.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను క‌లిగి ఉన్నారు.

విజయ్ దేవ‌ర‌కొండ‌కు రికార్డులు కొత్తేమి కాదు.ఆ మ‌ధ్య ఇండియాకు చెందిన 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ చోటు ద‌క్కించుకొని అంద‌రికి షాక్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ రౌడీ బాయ్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఫైట‌ర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. క‌రోనా వ‌ల‌న ఈ చిత్రానికి బ్రేకులు ప‌డ్డాయి.