ఏదీ ఆ ఆటిట్యూడ్.? ప్చ్.. ఎక్కడా కనిపించడంలేదు. పూర్తిగా నేలకు దిగిపోయాడు. విజయ్ దేవరకొండ గురించే ఇదంతా. ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే.. అది వేరే లెక్క.!
‘నేనే పెద్ద తోప్..’ అన్నట్లు వ్యవహరించేవాడు.. ఆ రౌడీ బిహేవియర్.. విజయ్ దేవరకొండ కెరీర్‌ని దారుణంగా దెబ్బ తీసేసింది. ‘లైగర్’ సినిమా గురించే అనుకుంటున్నాంగానీ, అంతకు ముందూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులే.! ఇక, అసలు విషయానికొస్తే.. చేయబోతున్న సినిమాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట విజయ్ దేవరకొండ.
పూర్తిగా ఆటిట్యూడ్‌ని పక్కన పడేశాడట. వివాదాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నాడట. సెట్స్‌లో విజయ్‌ని చూస్తున్నవారంతా ఆశ్చర్యపోతున్నారట. మార్పు మంచిదే.. అని విజయ్‌ని అభినందిస్తున్నారు కూడా.! ‘ఖుషీ’ సినిమా హిట్టయితే.. పోయిన ఇమేజ్‌ని కాస్తయినా మళ్ళీ విజయ్ దక్కించుకోగలుగుతాడు.