విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో మరోసారి స్పీడ్ పెంచేశాడు. ‘లైగర్’ తర్వాత కొంత నిరాశ ఎదురైనా, ఇప్పుడు వరుసగా ప్రాజెక్టుల పర్వం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా అనంతరం, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే పీరియాడిక్ సినిమాకు విజయ్ డేట్స్ కేటాయించేశాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని టాక్.
ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో విజయ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ‘ఫ్యామిలీ స్టార్’ సమయంలోనే దిల్ రాజు నుంచి అడ్వాన్స్ తీసుకున్న విజయ్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఆ సినిమా చేయాల్సింది. కానీ, విజయ్ తన లైనప్‌లో ఊహించని మార్పులు చేసి, ఈ ప్రాజెక్ట్‌ను కొంతకాలం వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం, విజయ్ తాజాగా బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి సైన్ చేయడం. ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నాగేశ్ భట్ చెప్పిన యాక్షన్ ఎంటర్టైనర్ కథ విజయ్‌కు బాగా నచ్చడంతో, వెంటనే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాకు ఓకే చెప్పేశాడు. ముంబైలో ప్రధానంగా షూట్ చేసే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే దిల్ రాజు సినిమా మొదలవుతుందట.
ప్రస్తుతం విజయ్ లైనప్ చూస్తే, ‘కింగ్‌డమ్’ పూర్తి చేసిన వెంటనే రాహుల్ సంకృత్యాన్ సినిమా, ఆపై బాలీవుడ్ యాక్షన్ మూవీ, ఆ తర్వాత రవి కిరణ్ కోలా ప్రాజెక్ట్. ఇలా వరుస సినిమాలతో విజయ్ బిజీగా ఉండబోతున్నాడు. ఈ లైనప్ చూసి ఫిల్మ్ వర్గాలు రౌడీ స్టార్ తన కెరీర్‌ను కొత్త లెవెల్‌కి తీసుకెళ్లే దిశగా దూసుకెళ్తున్నాడని అంచనా వేస్తున్నాయి.