విజయ్ దేవరకొండ పోస్ట్ తో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది!

Vijay revealed on social media who he was supporting

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికే చివరి వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. నిన్న 14వ వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజీత్, అఖిల్, అరియనా, సోహెల్, హారిక లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు రన్నర్ గా, ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే దానిపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.అభిమాన కంటెస్టెంట్‌ని ఎలాగైనా గెలిపించాల‌న్న త‌ప‌న‌తో అభిమానులు కూడా ఓట్ల ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా బిగ్‌బాస్‌ హౌజ్‌లో తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకు మద్దుతు తెలుపుతున్నారు.

abijeet in bigg boss
abijeet in bigg boss

ఈ ఐదుగురిలో మొత్తానికి అభిజీత్‌కి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. కాగా సెలబ్రిటీలు కూడా అభిజీత్ కే సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవటానికి ఏమి లేదు ఎందుకంటే మిగిలిన వారితో పోల్చితే చిత్ర పరిశ్రమలో అభిజీత్ కి అనుభవం మరియు పరిచయాలు ఉన్నాయి. హీరోగా రెండు మూడు సినిమాలు చేశాడు.ఇప్ప‌టికే నాగ‌బాబు, శ్రీకాంత్ లాంటి స్టార్స్ అభిజీత్‌కి బాహాటంగానే మద్దతు తెలపగా.. తాజాగా విజయ్ దేవరకొండ కూడా అభిజిత్ కి తనదైన క్రియేటివ్ శైలిలో మద్దతు తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్’‌ చిత్రం ద్వారా అభిజిత్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో విజయ్‌ దేవరకొండ ఒక పాత్రలో నటించాడు. ఆ సినిమా నుండి వీళ్లిద్దరికీ మంచి స్నేహం ఉందట. ఆ అభిమానంతో రౌడీ సరైన టైం లో తన మద్దతు తెలపటంతో అభిజీత్ విన్నర్ అయ్యే ఛాన్స్ లు పెరిగిపోయాయి.

Vijay revealed on social media who he was supporting
Vijay revealed on social media who he was supporting to

ఈ పోస్ట్ లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ టీమ్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ ”మై బాయ్స్‌కి ఎల్లప్పుడూ శుభాకాంక్షలు అందుతూనే ఉంటాయి… ఎక్కడైనా…ఏదైనా” అంటూ తన ఫ్యాన్స్ కి ఏం చెయ్యాలో అర్ధమైయ్యేలా చేసాడు. అభిజిత్ కి ఇది బాగా కలిసొచ్చేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్ కి అభిజిత్ టీమ్ ఫుల్ ఖుషీ అవుతూ విజయ్‌ దేవరకొండకు స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చారు. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో వచ్చే ఆదివారం జరిగే ఫైనల్ లో తెలిసిపోతుంది. వెయిట్ అండ్ సీ….