ఇలాగైతే విజయ్ దేవరకొండను ఎవ్వరూ ఢీ కొట్టలేరు!!

Vijay Devarakonda New Movie With Sukumar

విజయ్ దేవరకొండ స్పీడును టాలీవుడ్ షాక్ అయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం విజయ్ తాకిడిని తట్టుకోలేకపోయారు. ఇక వారసత్వపు హీరోల పనైపోయిందని అంతా అనుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో విజయ్ టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ సమయంలో విజయ్ ఫాలోయింగ్ చూస్తే ఏ స్టార్ హీరో అయినా షాక్ అయి ఉంటాడు. అయితే ఆ తరువాతే విజయ్ కెరీర్ మళ్లీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Vijay Devarakonda New Movie With Sukumar
Vijay Devarakonda New Movie With Sukumar

నోటా ఫ్లాప్ అవ్వగా.. టాక్సీవాల ఆదుకుంది.. మళ్లీ డియర్ కామ్రేడ్ బెడిసికొట్టగా.. వరల్డ్ ఫేమస్ లవర్ ఆదుకుంటుందని అందరూ భావించారు. అది డిజాస్టర్ అవ్వడంతో విజయ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ప్లానింగ్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఓ వైపు టాలీవుడ్‌పై గురి పెడుతూనే బాలీవుడ్‌ను ఏలేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే బాలవుడ్ డెబ్యూ ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాడు.

Vijay Devarakonda New Movie With Sukumar
Vijay Devarakonda New Movie With Sukumar

ఆల్రెడీ పూరి జగన్నాద్ ఫైటర్ సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ అవుదామని రెడీ అయ్యాడు. ఇక మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను తాజాగా ప్రకటించాడు విజయ్ దేవరకొండ. లెక్కల మాస్టర్ సుకుమార్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ కన్ఫాం అయింది. ఈ మేరకు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. 2022లో ఈ మూవీ రిలీజ్ కానుందని తెలిపాడు. ఇలా అయితే విజయ్ స్టార్డం, క్రేజ్‌ను ఎవ్వరూ కూడా ఢీ కొట్టలేరు.