రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోలలో విజయ్ ఒకరు కావడం గమనార్హం. విజయ్ దేవరకొండ ఇప్పటికే లైగర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా ఆగష్టు నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా కశ్మీర్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తైంది. ఈ సినిమాలో విజయ్ సమంత మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని ఆ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలి సినిమా ఏదనే ప్రశ్నకు చాలామంది పెళ్లిచూపులు అని సమాధానం చెబుతారు.

అయితే విజయ్ దేవరకొండ తొలి సినిమా నువ్విలా కావడం గమనార్హం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో మెరవగా ఆ పాత్ర కోసం విజయ్ ఎలాంటి రెమ్యునరేషన్ ను తీసుకోలేదని సమాచారం అందుతోంది. లైగర్ సినిమా కోసం ఈ స్టార్ హీరో 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. విజయ్ లైగర్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

లైగర్ సినిమా థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. లైగర్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. లైగర్ సినిమా సక్సెస్ విజయ్ దేవరకొండ కెరీర్ కు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. విజయ్ గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.