Pushpa Movie: పుష్ప పార్ట్ 3 లో హీరోగా విజయ్ దేవరకొండ… బన్ని పరిస్థితి ఏంటి ?

Pushpa Movie: టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో డేరింగ్, అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతోనూ అభిమానులను అలరించి క్రేజీ స్టార్ గా ఎదిగారు విజయ్.

కాగా అంత భారీ విజయం అందుకున్న విజయ్ కి, గత రెండు సంవత్సరాల నుంచి ఏ సినిమా లేకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. ఐతే ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. వినూత్న కథలతో ఆకట్టుకుంటున్న విజయ్.. ఈ సినిమాతోనూ అలరిస్తాడని సినీ ప్రేక్షకులు అంతా ఆకాంక్షిస్తున్నారు.

ఐతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజింగ్ పేరుతో విడుదలైన మూవీ ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాంతో అదే హుషారులో ప్రస్తుతం పార్ట్ 2 తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ఆరంభం అవుతుందని సమాచారం. ఐతే తాజాగా సుకుమార్ పుట్టినరోజున విజయ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. దీంతో పుష్ప పార్ట్ 3 ది రాంపేజ్ పేరుతో సుకుమార్ తో పని చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మజిలీ డైరెక్టర్ శివ నర్వాణ డైరెక్షన్ లోనూ ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల రానున్న సినిమాకు డేట్స్ కుదరడం లేదని సమాచారం. ఈ సినిమాలోనూ సమంతనే హీరోయిన్ గా చేస్తుందని సినీ వర్గాల అభిప్రాయం.