2024 సంక్రాంతి హీట్ : విజయ్ కూడా వచ్చేస్తున్నాడు.!

టాలీవుడ్ సినిమా సహా కోలీవుడ్ సినిమా దగ్గర కూడా ఓ ఏడాదిలో బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్ టైం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఈ సీజన్లో లో వచ్చే సినిమాలు విషయంలో నెలకొనే టెన్షన్ అంతా ఇంతా కాదు. పలు భారీ భారీ చిత్రాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చి హిట్ కొడుతూ ఉంటాయి.

అలాగే వీటికి తోడు రైవల్ చిత్రాలు ఉంటే ఆ హీట్ మామూలుగా ఉండదు. అదే ఈ ఏడాది 2023 సంక్రాంతికి అటు కోలీవుడ్ ఇటు మన దగ్గర కూడా చూసాము. అయితే ఇక వచ్చే ఏడాది సంక్రాంతి అయితే మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అనౌన్స్ అయ్యిన చిత్రాలు చాలా ఉన్నాయి.

వాటిలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మరో భారీ చిత్రం హనుమాన్, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం అలాగే మాస్ మహారాజ్ ఈగల్ లు ఆల్రెడీ ఈ రేస్ ని లాక్ చేసుకోగా ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కెరీర్ 13వ సినిమాని అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న సినిమాని కూడా మేకర్స్ ఇపుడు ఇదే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు.

దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి మరింత వేడిగా ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అయితే దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.