Vijay Antony : తెలుగు సినిమా తో వస్తోన్న ఆంటోనీ.. హత్య సినిమా పోస్టర్ తో ఇంట్రెస్ట్ పెంచిన బిచ్చగాడు…!

Vijay Antony: విజయ్ ఆంటోనీ తమిళ్ హీరో అయినప్పటికీ బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు.డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు సినిమాల్య్ తెలుగులో మంచి ఆదరణ పొందాయి.తాజాగా హత్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతోంది.లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ ఈ చిత్రన్ని నిర్మిస్తోంది.కమల్ బోరా,జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా లో రితికా సింగ్ హీరోయిన్ గా చేస్తున్నారు, రితిక సింగ్ సంధ్య అనే పాత్ర లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించునున్నారట.ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను బుధవారం చిత్రబృందం విడుదల చేశారు.ఈ పోస్టర్ లో హీరో విజయ్ ఆంటోనీ తో పాటు మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ లాంటి పాత్రాలను రేవీల్ చేశారు.ఈ పోస్టర్ లో హీరో డిటేక్టివ్ లాగ ఒక హాట్ ఇంకా కోట్ తో సహజంగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులుగా మురళీ శర్మ, ఇంకా రాధికా శరత్ కుమార్ ల ఫోటోలను పట్టుకున్నాడు.

‘1923’లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటననేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగనుంది.ఈ చిత్రనికి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ ఏంటోను సినిమా ప్రస్థానం లో ఇదొక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తున్నారు.