ఆమె మెరిసే అందం.. భార్య అందానికి ముగ్ధుడైన విగ్నేష్.. పోస్ట్ వైరల్!

నయనతార విగ్నేష్ 2015 వ సంవత్సరంలో మొదటిసారి వీరిద్దరూ నానుమ్ రౌడీ థాన్ లో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరూ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ ఈ ఏడాది జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇక తాజాగా సరోగసి వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఈ దంపతులకు కాస్త ఉపశమనం లభించింది.

పెళ్లి జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యామంటూ వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అయ్యింది.ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ విషయంపై స్పందిస్తూ సరైన ఆధారాలు కనుక సమర్పించకపోతే ఈ దంపతులకు శిక్ష తప్పదు అంటూ నోటీసులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ దంపతులు ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని గత ఏడాది క్రితమే సరోగసి కోసం అప్లై చేశారని ఆధారాలు అన్నింటిని సమర్పించడంతో ఈ దంపతులు పూర్తిగా సరోగసి వివాదం నుంచి బయటపడ్డారు.

ఇకపోతే సరోగసి విషయంలో పెద్ద ఎత్తున వీరి గురించి నేటిజన్స్ ట్రోల్ చేయడంతో ఎప్పటికప్పుడు విగ్నేష్ శివన్ పరోక్షంగా ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా నయనతార పాస్పోర్ట్ సైజ్ ఫోటోని షేర్ చేస్తూ ఆమె మెరిసే అందం అంటూ తన భార్య అందం గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే విగ్నేష్ శివన్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ఈమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.