సినిమా తారలందరూ ఒకేలా ఉండరు. అసలే కాలం మారింది. మీటూ క్యాస్టింగ్ కౌచ్ అనే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అయినా ఇంకా కొందరికి బుద్ది రానట్టు కనిపిస్తోంది. తాజాగా మధ్య ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి వ్యవహారం వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం విద్యా బాలన్ తన షేర్నీ మూవీ షూటింగ్ నిమిత్తం మధ్య ప్రదేశ్ అడవుల్లో ఉంది. విద్యా బాలన్ అడువుల్లో షూటింగ్ చేస్తోందని తెలిసిన ఫారెస్ట్ మినిస్టర్ విజయ్ షా తన వక్ర బుద్దిని చూపెట్టాడు.
విద్యా బాలన్‌ను కలిసి డిన్నర్‌కు ఆహ్వానించాడట. కానీ విద్యా బాలన్ మాత్రం కిందికిపైకి చూసి నో చెప్పిందని టాక్. దీంతో అహం దెబ్బ తిన్న సదరు మంత్రి ఈగో హర్ట్ అయినట్టు సమాచారం. జిల్లా అటవీ అధికారులను పిలిచి షూటింగ్ జరగకుండా చూడాలని అదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో.. అటవీ అధికారులు షూటింగ్‌కు సంబంధించిన వాహనాలను లోపలకి అనుమతించ లేదట. కేవలం రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారట.
ఈ విషయాలు కాస్తా మీడియా దృష్టికి రావడంతో సదరు మంత్రి తోక ముడిచినట్టు కనిపిస్తోంది. తాను విద్యా బాలన్‌ను డిన్నర్‌కు పిలవ లేదని, ఆ మూవీ యూనిట్.. తనను లంచ్ లేదా డిన్నర్‌కు ఆహ్వానించిందని మాట మార్చాడు. తాను బిజీగా ఉండటంతో రాలేనని చెప్పినట్టు.. మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పాడట. అలా డిన్నర్ లంచ్ క్యాన్సిల్ అయింది కానీ షూటింగ్ కాదని ప్లేటు ఫిరాయించాడట. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం.. వైరల్ కావాల్సిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయని తెలుస్తోంది.