వెంకీ ఆ హీరోయిన్ కాళ్ళు మొక్కారా….అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు వారసునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస విక్టరీలు సాధించి విక్టరీ వెంకటేష్ గా ప్రసిద్ధి పొందారు. విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. హీరో వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 70 పైగా సినిమాలో నటించి అనేకసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా పొందారు.

విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన సినిమాల్లో పవిత్ర బంధం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1996 అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా విక్టరీ వెంకటేష్ సౌందర్య జంటగా అద్భుతంగా నటించారు.ఇందులో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్ర పోషించగా ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు.

పవిత్ర బంధం సినిమాలో విక్టరీ వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు విషయానికొస్తే ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ అప్పట్లో ఓ సెన్షేషన్‌. ఈ సీన్‌లో ఆశీర్వదించమని సౌందర్య వెంకటేష్ కాళ్లు మొక్కుతుంది. అందుకు వెంకటేష్ ఆశీర్వదించాల్సింది పెద్దలు, దేవుళ్లు అని చెబుతాడు. దానికి సందర్య పతి కూడా ప్రత్యక్ష దైవమే కదండీ ఈరోజు నుంచి నాకు అన్నీ మీరే అనగానే వెంకటేష్ తిరిగి సౌందర్య కాళ్లు మొక్కుతాడు. సౌందర్య తప్పు కదండి అంటే నువ్వు నా కాళ్లకి దణ్ణం పెడితే తప్పు లేనప్పుడు నేను నీ కాళ్లకి దణ్ణం పెడితే తప్పేముంది? భర్తలు ఏమైనా దేవుళ్ళ అని ప్రశ్నిస్తాడు. మహిళలను ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రప్పించిన ఘనత విక్టరీ వెంకటేష్ కే దక్కుతుంది. అప్పట్లో ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో వంద రోజులు పైగా ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఈ సినిమా ఆరు భాషల్లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది.