ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో కి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పుడే ఈ షో ఓ రేంజ్ లో దూసుకుపోతుందని అందరూ ఎక్స్పర్ట్ చేశారు. అందరి అంచనాలని నిజం చేస్తూ బాలకృష్ణ తన ఎనర్జిటిక్ హోస్టింగ్ తో షో ని సూపర్ హిట్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్, జోవియల్ బిహేవియర్ షో కి మరింత వన్నె తీసుకొచ్చాయి.
ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తుంది. లేటెస్ట్ గా ఈ షో కి విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి బరిలో వెంకటేష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ షో కి విచ్చేశారు. ఇద్దరూ స్టార్ హీరోలు ఒక స్టేజ్ పై కనిపించడంతో షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఎపిసోడ్ లో వెంకీ తన పర్సనల్ లైఫ్ తో పాటు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తోని, మహేష్ బాబు తోని స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ని వాళ్ళిద్దరి గురించి చెప్పమని అడిగినప్పుడు మహేష్ నా చిన్న తమ్ముడు, అందరికీ గౌరవం ఇస్తాడు, మేమిద్దరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో బాగా దగ్గరఅయ్యాం. నిజమైన అన్న తమ్ముడు లాగే ఆ సినిమా చేసామని చెప్పుకొచ్చాడు వెంకటేష్. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ గోపాల గోపాల సినిమా కంటే ముందే నాకు పవన్ తెలుసు.
మా ఇంటికి ఎక్కువగా వస్తూ ఉండేవాడు, నా దగ్గర లేజర్ డిస్కులు ఉండేవి, వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు. మేము ఇద్దరం సైలెంట్ గా ఉంటాం, ఇద్దరికీ భక్తి భావం ఎక్కువ. సైలెంట్ గా ఉంటూనే ఒకరికొకరు అర్థం చేసుకుంటాం అన్నారు వెంకటేష్. వెంకటేష్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ షో లో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కూడా పాల్గొని షో ని రక్తి కట్టించారు.