‘వీర సింహా’ వర్సెస్ ‘వీరయ్య’.. థర్డ్ రౌండ్ లో చిరు గెలిచేనా.?

మన తెలుగు సినిమా అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ లు మళ్ళీ చాలా కాలం తర్వాత అయితే తమ భారీ పోటీతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీకి దిగబోతున్నారు. మరి అనూహ్యం ఇద్దరు సినిమాల టైటిల్స్ కూడా దాదాపు ఒకేలా వీర సింహా రెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య అంటూ “వీర” అనే నామకరణంతోనే వస్తుండడం విశేషం.

ఇక ఇది పోలిక కాగా పోటీ మాత్రం ఇద్దరి సినిమా ఫస్ట్ లుక్స్ సహా ఫస్ట్ సాంగ్ రెండో సాంగ్ వరకు వచ్చింది. ఇక ఈ సినిమాల నుంచి ఆల్రెడీ రెండేసి పాటలు బయటికి రాగ మొదటి రౌండ్ లో అయితే చిరు తన బాస్ పార్టీ తో భారీ రెస్పాన్స్ కొల్లగొట్టి అదరగొట్టాడు.

ఇక నెక్స్ట్ రెండో సాంగ్ లో అయితే బాలయ్య తన సుగుణ సుందరికి చిరు రెండో సాంగ్ కన్నా మంచి టాక్ అందుకొని విన్ అయ్యారు. దీనితో రెండు పాటల్లో చిరు వెనక్కి వెళ్ళాడు. దీనితో ఇక మూడో సాంగ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఆల్రెడీ వీర సింహా రెడ్డి కి మూడో సాంగ్ కూడా థమన్ అదరగొట్టేశారని బజ్ ఉంది పైగా నిన్నే ఆ సాంగ్ కూడా అనౌన్స్ చేసేసారు. మరి ఇదిలా ఉండగా ఇంకా చిరు మూడో సాంగ్ కూడా మంచి మాస్ గా ఉంటుందని అంటున్నారు. దీనితో ఈ పోటీలో మళ్ళీ చిరు ముందుకు వస్తాడా అని అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.