అలాంటి డ్రెస్‌లో ఫోటో షూట్.. కవర్ చేసేందుకు కష్టాలు పడ్డ హీరోయిన్!

Vedhika Latest Photoshoot Goes Viral

హీరోయిన్‌గా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తెలుగు ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోతోంది వేదిక. ముని సినిమా నుంచి ఓ సాలిడ్ హిట్ కొట్టాలని, కమర్షియల్ బ్రేక్ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంది. బాణం, దగ్గరగా దూరంగా ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్కటి సరైన ఫలితాన్ని ఇవ్వనేలేదు. ఇక చివరగా బాలయ్య హీరోగా వచ్చిన రూలర్ చిత్రంలో నటించింది. అది కూడా అలాంటి ఫలితాన్నే ఇచ్చింది.

Vedhika Latest Photoshoot Goes Viral

అయితే ఈ భామకు వెండితెరపై అంతటి క్రేజ్, ఫాలోయింగ్ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక చివరగా బాలయ్య సినిమాలో కనిపించడంతో ఈమెను అలాగే పిలవడం ప్రారంభించారు. బాలయ్య హీరోయిన్ అంటేనే ఈమెను గుర్తు పడుతున్నారు. ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డ్యాన్సులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Vedhika Latest Photoshoot Goes Viral

క్లాసికల్ డ్యాన్సులైనా, వెస్ట్రన్ డ్యాన్సులైనా సరే వేదిక అదరగొడుతుంది. లాక్ డౌన్‌లో ఇలా డ్యాన్సులు చేసిన వీడియోలను షేర్ చేస్తూ వైరల్ అయింది. ఇక తాజాగా ఆమె చేసిన ఓ ఫోటోషూట్ తెగ వైరల్ అవుతోంది. ఆ డ్రెస్ మరీ చిన్నదిగా ఉండటం, కూర్చున్నట్టుగా పోజులివ్వడం ఇబ్బందిగా తయారైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో చేతిని అడ్డం పెడుతూ ఫోటో షూట్లను కానిచ్చింది. అలా ఇబ్బంది పడుతూ ఎందుకు అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.