Varun Tej: సినిమా నాకు బ్రతకడం నేర్పిందని ఎమోషనల్ అయిన వరుణ్ తేజ్..!

 

Varun Tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు.

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. ఏ సినిమా స్పోర్ట్స్ డ్రామా డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు. ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల ఉండటంతో ప్రమోషన్ లో భాగంగా నేను ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి. బాక్సింగ్ చాంపియన్ కావాలనుకునే గని, జీవితం లో బాక్సింగ్ ఆడననీ అమ్మ కి ఇచ్చిన మాటను జవదాటి బాక్సింగ్ లో నేషనల్ చాంపియన్ గా ఎలా ఎదిగాడు అన్నదే కథ అని అనుకుంటున్నారు.

ట్రైలర్ వేడుక సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రేక్షకులకు మంచి సినిమాను ఇచ్చేందుకు గనిని రూపొందించాం. నిజనానికి నేను సినిమాల్లోకి రాకపోతే ఎక్కడో పోరంబోకులా తిరిగే వాడిని, నాకు సినిమా డిసిప్లయిన్ నేర్పించింది. బతకడం నేర్పించిందంటూ కొంత ఎమోషనల్ అయ్యాడు.’ ఈ సినిమా గురించి అయితే వరుణ్ తేజ్ ఒక కోచ్ని,పెట్టుకొని మరి కష్టపడ్డాడు అట, సినిమా ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి