Ghani: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు.ఈ చిత్రం కోసం వరుణ్ విదేశాల్లో బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు.ఐతే ఈ సినిమా ను బాగా ప్రమోట్ చేసుకొవాలి అని మెగా ఫ్యామిలీ భావిస్తున్నారు.దీనిలో భాగంగానే హైదరాబాద్ లో కూడా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది ఈ చిత్రం.
ఈ ప్రమోషన్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొనాల్సి వుంది.కానీ ఇటీవల హైదరాబాద్ లోని పబ్ రైడ్ ఘటనలో 140 మంది పట్టుబడగా అందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. గని మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా జరిగే మీడియా ఇంటిరాక్షన్స్ లో ఈ ఘటనకు సంబంధించి ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని తెగ టెన్షన్ పడుతున్నాడట వరుణ్. ముఖ్యంగా మెగాస్టార్ చింరజీవి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారట. నిహారిక అంటే చిరుకి ప్రాణం. అదీ కాకుండా, చిరు ఇప్పుడు తన ఆచార్య సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.అలాగే వరుణ్ తేజ్ గని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా చూశారు. సినిమాలో వరుణ్ తేజ్ నటన చిరుకి బాగా నచ్చింది. అందుకే.. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని చిరు భావించారు.
ఇప్పుడు తాను ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలలో పాల్గొంటే.. మీడియా ఆ పబ్ రైడ్ గురించి అడగకుండా చూసుకోవాలి అని చిరు ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. గని సినిమాకి బాగా హైప్ తీసుకురావాలని చిరంజీవి ప్రయత్నిస్తున్న వేళ.. అనవసరంగా ఈ పబ్ రైడ్ గురించి అడిగి.. తాను ఏదోకటి మాట్లాడితే.. మ్యాటర్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది.ఇక గని సినిమాను ఎవరూ పట్టించుకోరు.అందుకే.. చిరు తాను ఇవ్వనున్న ఇంటర్వ్యూలో మీడియా ఎలాంటి పరిస్థితులో కూడా ఆ పబ్ రైడ్ గురించి అడగకూడదు అని చిరు.. తన పీఆర్వో టీమ్ కి చెప్పినట్టు తెలుస్తోంది.చూడాలి మరి ఈ విషయం గని సినిమా మీద ఇలాంటి ప్రభావం చూపుతుందో.