మ‌నిష‌న్నాక కొద్దిగన్న సిగ్గుండాలి.. అంద‌రి ముందే హైప‌రి ఆదిని చెడుగుడులాడిన వ‌ర్షిణి

ప‌టాస్ 2 షోతో పాపుల‌ర్ అయిన వ‌ర్షిణి, జ‌బర్ధ‌స్త్ షోతో ఫుల్ ఫేమ‌స్ అయిన హైప‌ర్ ఆది కాంబినేష‌న్ చాలా బాగుంటుంది. ఢీ స్టేజ్‌పై వీరు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. వ‌ర్షిణి మాట‌ల‌కు హైప‌ర్ ఆది వేసే పంచ్‌లు జడ్జెస్‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కూడా ఎంతో వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా వీరిద్దరి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

షోని రక్తి క‌ట్టించేందుకు సుధీర్, ర‌ష్మీ జంట‌కు పోటీగా హైప‌ర్ ఆది, వ‌ర్షిణి త‌మ‌దైన పంచ్‌ల‌తో అల‌రిస్తుంటారు. గొడ‌వ‌లు, రొమాన్స్ , స‌ర‌సాలు ఇలా ఆడియ‌న్స్ ని అల‌రించేందుకు ప‌లు ర‌కాల జిమ్మిక్స్ చేస్తుంటారు. నవంబర్ 25న ప్రసారం అయ్యే ఈ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల కాగా, ఇందులో ఆది- వర్షిణి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌కి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కామెడీలో భాగ‌మే అనుకోండి. ఆది .. ప్ర‌దీప్‌తో మాట్లాడుతూ..నా ప్రేమ‌లో ప‌డుద్ది అంటావా అంటాడు. దీనికి ప్ర‌దీప్.. పడుద్ది.. కొంత ముక్కులోంచి.. మరికొంత చేవిలోంచి అంటూ చేయి తిప్పుతూ ఆదిని బెదిరిస్తుంటాడు.

ఇక ఆది, వ‌ర్షిణిల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లో .. నా ముందు నీవు తగ్గుండాలి.. నా దగ్గరకు వచ్చినాక ఓ హగ్గుఉండాలి.. అంటాడు ఆది. దీనికి వెంటనే వర్షిణీ మరో పంచ్ విసురుతూ.. మనిషాన్నాక‌ కొద్దిగా సిగ్గుండాలి.. అంటూ త‌న‌దైన శైలిలోకౌంటర్ ఇవ్వ‌డంతో డాన్స్ షో జడ్జీలు శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ తెగ‌ నవ్వారు. అయిన నా లాంటి ప్రిన్సెస్, నా పక్కన ప్రిన్స్ ఉండాలి.. నేనో క్విన్.. నా పక్కన కింగ్ ఉండాలి అనగా.. హైపర్ ఆది వెంటనే నువ్వేప్పుడూ ఇలా నవ్విస్తూ ఉండాలి అంటూ పంచ్ విసిరాడు. ఇక సుధీర్ , ర‌ష్మీలు కూడా ఆక‌ట్టుకున్నారు.