మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన వర్ష ఇటీవల స్వాతిముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ద్వారా వర్ష మరొక హిట్ తన అకౌంట్లో వేసుకుంది. ఇదిలా ఉండగా వర్ష గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
హీరోయిన్ వర్ష ఒక ప్రముఖ నిర్మాత ఇంటికి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన వర్ష.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో స్పందించిన వర్ష
పెళ్లి వార్తల గురించి ప్రచారంలోకి వచ్చిన లింక్స్ ను షేర్ చేసి ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ఇక నాకు పెళ్ళి చూపులు చూసి అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థాంక్స్ . ఆ అబ్బాయి ఎవరో చెబితే నేను కూడా మా ఇంట్లో వాళ్లకు చెబుతాను అంటూ చాలా వ్యంగ్యంగా స్పందించింది.
నా పెళ్ళి చూపులు చూడాలంటే ఆహా లో స్ట్రీమ్ అవుతున్న స్వాతిముత్యం మూవీలో చూడండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలా తన పెళ్ళి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని వర్ష అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇకనైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో? లేదో? చూడాలి మరి. వర్ష కెరీర్ విషయానికి వస్తే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్న వర్ష ఇటీవల స్వాతిముత్యం సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా హిట్ అవటంతో తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. అంతే కాకుండా ఈ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో కొంత ఆచి తూచి అడుగులు వేయటంతో నిర్మాతలు కూడా ఈమెని హీరోయిన్ గా తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.