Varalakshmi: నీ గురించి చెప్పడానికి ఒక్క నిమిషం సరిపోదు… భర్తపై నటి వరలక్ష్మి ఎమోషనల్ పోస్ట్!

Varalakshmi: సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన వరలక్ష్మి హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కానీ నిలిచిన వరలక్ష్మి తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సఛ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇకపోతే ఎప్పటికప్పుడు తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను వరలక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా తన భర్త నికోలయ్ పుట్టినరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్తకు సంబంధించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో తన భర్త పై తనకున్నటువంటి ప్రేమను మొత్తం వరలక్ష్మి బయట పెట్టారు. . ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది వరలక్ష్మి..ఈ సంవత్సరంలో చాలా జరిగింది, అన్నీ చాలా వేగంగా జరిగాయి, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అన్నీ మన అద్భుతమైన జ్ఞాపకాలే ఉన్నాయి.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి ఒక్క నిమిషం సరిపోదు.

నువ్వు నీలా ఉన్నందుకు థాంక్యూ సో మచ్.. నా పక్కన ఉన్నందుకు చాలా సంతోషం. నీలాంటి వ్యక్తి నా భర్తగా రావడం నా అదృష్టం నేను ఇంతకుమించి మరేమీ అడగను హ్యాపీ బర్త్డే అంటూ తన భర్త గురించి ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది