గతమంతా అందులో తగలబెట్టేస్తా.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

Vanitha Vijay Kumar Bhogi 2021 SPecial Video

వనిత విజయ్ కుమార్ 2020లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2020లోనే మూడో పెళ్లి చేసుకుంది.. దాన్ని పెటాకులు కూడా చేసేసుకుంది. ఎలిజబెత్‌కు పీటర్ పాల్ విడాకులు ఇవ్వకపోయినా సరే.. అతడిని వనిత పెళ్లి చేసుకుంది. ఇక మాది జన్మన్మల బంధం అంటూ పెద్ద పెద్ద డైలాగులు వల్లించింది. అలా ఎలిజబెత్‌కు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం తప్పని అందరూ చెబుతున్నా కూడా మా ప్రేమ గొప్పది.. మా మధ్యలో ఎవ్వరూ దూరం పెంచలేరని బాగానే చెప్పుకొచ్చింది.

Vanitha Vijay Kumar Bhogi 2021 SPecial Video
Vanitha Vijay Kumar Bhogi 2021 SPecial Video

కానీ చివరకు అది ప్రేమ బంధం కాదని తెలిసిపోయింది. ఆ మూడో పెళ్లి కూడా తొందర పాటు చర్యే అని చెంపలు వేసేసుకుంది. గోవాలో బర్త్ డే పార్టీని సెలెబ్రేట్ చేసుకుందామని పీటర్ పాల్, వనిత వెళ్లారు. అక్కడ పీటర్ పాట్ బాగా తాగి రచ్చ రచ్చ చేశాడట. అసభ్యకరంగా ప్రవర్తించడంతో వనిత విసిగెత్తిపోయిందట. అంతకు ముందు పీటర్‌కు ఆరోగ్యంగా బాగా లేకపోతే ఆపరేషన్ చేయించింది. ఆ క్షణంలో ప్రేమ బాగానే కారిపోయినట్టు ట్వీట్లు పెట్టింది. కానీ గోవాలో జరిగిన ఘటనతో పీటర్‌ను ఇంట్లోంచి గెంటేసిందట.

అలా మొత్తంగా 2020లోనే మూడో పెళ్లితో నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. లాక్డౌన్‌ మొత్తంలో వనిత ఎపిసోడ్ అందర్నీ ఎంటర్టైన్ చేసింది. ఇక 2020 చివర్లో ఇలా మూడో పెళ్లి పెటాకులతో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే భోగీ అంటే గతాన్ని, చెడును అంతా మంటల్లో వేసి ముందుకు వెళ్లడమే పండుగ అర్థం. కాబట్టి తన గతాన్ని మూడో పెళ్లిని, పీటర్‌ను భోగీ మంటల్లో వేసేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. దీనిపై ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. మొత్తానికి వనిత మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు.