వకీల్ సాబ్ సంక్రాంతి కి మిస్ అయితే సమ్మర్ లోనే కనిపిస్తాడా ..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరసగా 6 సినిమాలు కమిటయినప్పటికి వాటిలో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న క్లారిటీ మాత్రం సరిగ్గా రావడం లేదు. కరోనా కారణంగా ప్రాజెక్ట్స్ ప్లాన్స్ అన్ని తారుమారవుతున్నాయి. అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటి. ఎట్టి అరిస్థితుల్లోనూ 2021 లో పవర్ స్టార్ కనీసం 3 సినిమాలని రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ రకంగానే డేట్స్ ఇచ్చాడు. అయితే ఇపటి వరకు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. కారణం థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియకపోవడమే.

ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించే. 2021 మొదలైతే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి మూడేళ్లు అయ్యినట్టే. అందుకే అందరూ వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో ఆసక్తిగా ఉన్నారు. రిలీజ్ సంగతి అలా ఉంచితే వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అందరు ఎదురు చూస్తుంటే మేకర్స్ నుంచి మాత్రం కరెక్ట్ అప్‌డేట్ రావడం లేదు. దీపావళి పండగ కి వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేస్తామన్న మాట వినిపిస్తుంది. కాని ఎలాంటి సమాచారం మాత్రం అందడం లేదు.

దాంతో ఇప్పుడు వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ ఉంటుందా అన్న మాట తో పాటు అసలు సంక్రాంతికైనా ఈ సినిమా రిలీజ్ చేస్తారా అన్న కొత్త టాక్ మొదలైంది. గత కొద్ది రోజులుగా వకీల్ సాబ్ 2021 సంక్రాంతి విడుదల అవుతుందని వార్తలు వచ్చినప్పటికి ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేదన్న సంగతి తెలిసిందే. అందుకే వకీల్ సాబ్ సమ్మర్ లోనేనా అంటున్నారట. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తయారవుతున్న వకీల్ సాబ్ విషయం లో దిల్ రాజు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాడో చూడాలి.