వకీల్ సాబ్ : దిల్ రాజు ప్లాన్స్ అన్ని పవర్ స్టార్ చేతిలోకి ..?

వకీల్ సాబ్ సినిమా విషయంలో పనులు వేగవంతం అవుతున్నాయని తాజా సమాచారం. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో వకీల్ సాబ్ మీద భారీగా అంచనాలున్నాయి. పవర్ స్టార్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ ఒరిజినల్ పింక్ కథ లో కొన్ని కీలక మార్పులు చేసి కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వాస్తవంగా ఈ సినిమాకి దిల్ రాజు ఎక్కువే బడ్జెట్ ఖర్చు చేశారని అంటున్నారు. అదంతా పవర్ స్టార్ మీద దిల్ రాజు కి ఉన్న అభిమానం తోనే అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక వసూళ్ళు పరంగా పవర్ స్టార్ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకోసం ప్రేక్షకులు, పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు దిల్ రాజు ప్లాన్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు సాగాయి.

కాని ఇప్పుడు వకీల్ సాబ్ ప్రమోషనల్ ప్లాన్స్ పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు టాక్ మొదలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అది కూడా మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ దిల్ రాజు కి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ని మొదలు పెట్టమని సలహాలిచ్చాడట. పెద్ద గ్యాప్ లేకుండా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు వరసగా పోస్టర్స్ ని రిలీజ్ చేయమని చెప్పాడట.

అంతేకాదు త్వరలో టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి దిల్ రాజు ని ప్లాన్ చేయమని చెప్పాడట పవన్ కళ్యాణ్. థమన్ సంగీతమందితున్న ఈ సినిమా నుంచి ఇంతకముందే రిలీజైన మగువా మగువా సాంగ్ జనాలలోకి బాగానే దూసుకుపోయింది. ఇప్పుడు థమన్ మరో సాంగ్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శృతిహాసన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనుండగా త్వరలో షూటింగ్ లో జాయిన్ కానుందని సమాచారం.