NTR – Vadde Naveen: వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీనే…. ఎలానో తెలుసా?

NTR – Vadde Naveen: తెలుగు సినీ పరిశ్రమలో లో ఒక‌ప్పుడు భారీ క్రేజ్ ఉన్న నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న హీరో వ‌డ్డే న‌వీన్. కెరీర్ బిగినింగ్‌లో తన నటనతో తెలుగు అభిమానులకు చేరువైన న‌వీన్, వ‌రుస హిట్లు అందుకుని ల‌వ‌ర్ బా‌య్‌గా కూడా పేరుతెచ్చుకున్నారు. ఆ త‌ర‌వాత న‌వీన్ ఫ్యామిలీ హీరోగానూ గుర్తింపు తెచ్చుకొని, మరింత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో న‌వీన్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఆ సినిమా అనుకోని విధంగా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన పెళ్లి సినిమా కూడా సూప‌ర్ హిట్‌గా నిలివడంతో నవీన్‌కు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక ఈ సినిమా త‌ర్వాత ఊహించినట్టు గానే వ‌డ్డే న‌వీన్ కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.

ఇక వ‌డ్డే న‌వీన్ ఇండ‌స్ట్రీ లోకి రావ‌డానికి కారణం ఆయన తండ్రి వ‌డ్డే రమేషేనట. ఆయన నిర్మాత కావడం వల్లే నవీన్‌కు కూడా సినిమాలపై ఆసక్తి ఏర్పడి, సినీ రంగ ప్రవేశం చేశాడని టాక్. ఇక ప్రస్తుతం మాత్రం న‌వీన్ ఇండస్ట్రీకి పూర్తిగా దూర‌మైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వ‌డ్డే న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగ‌తి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎన్టీరామారావు కుమారుల‌లో ఒక‌రు అయిన నంద‌మూరి రామ‌క్రిష్ణ కూతురును వ‌డ్డే న‌వీన్ వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా ఈ సంబంధాన్ని ఎన్టీఆరే కుదిర్చార‌ని..ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ మంచి స్నేహితుడని కూడా అప్పట్లో ప్రచారం జరిగిందట.

అలా మొత్తానికి సంబంధం కుదిరి న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అయ్యాడు. ఆ తర్వాత పలు కారణాల వల్ల నవీన్ ఆమెకు విడాకులిచ్చి ఆ ఫ్యామిలీకి దూరం అయ్యారట. ఇక అప్పటి నుంచీ నందమూరి కుటుంబానికి వడ్డే నవీన్ ఏ రకమైన సంబంధాన్నీ కొనసాగించలేదని సమాచారం. ఇక్కడ చెప్పుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నందమూరి ఫ్యామిలీలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రం నవీన్ సన్నిహితంగానే ఉంటాడని సినీ వర్గాల టాక్.