పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది… ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని హరీష్ ఆవిష్కరిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న మూవీ ఇది కావడం ఒక విశేషం. అలాగే ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండటం మరో విశేషం.

దీంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. మరోసారి గబ్బర్ సింగ్ ఫీట్ రిపీట్ అవుతుందని పవర్ స్టార్ అభిమానులు అంచనా వేస్తోన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ గింప్స్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఈ గ్లింప్స్ ని మొదటిసారి థియేటర్ లో రిలీజ్ లాంచ్ చేసి అందించడం విశేషం.

ఇక ఫస్ట్ గ్లింప్స్ చూస్తూ ఉంటే గబ్బర్ సింగ్ ఫ్లేవర్ పెర్ఫెక్ట్ గా ఈ చిత్రంలోని కనిపించబోతుందని అర్ధం అవుతోంది. భగవద్గీత శ్లోకంతో వీడియో స్టార్ట్ చేసి భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని టీ గ్లాస్ తో రివీల్ చేస్తూ ఎలివేట్ చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్ ఓల్డ్ సిటీ అని పరిచయం చేయడం ద్వారా చిత్ర కథాంశం ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది అని ప్రెజెంట్ చేశారు.

ఇక ముస్లిమ్స్ మసీద్ లో ఉండగా జీప్ లోంచి జంప్ చేసుకుంటూ బయటకి రావడం. హీరోయిన్ కోసం రోడ్డు దాటుతూ ఉండటం, అలాగే విలన్ కి వార్నింగ్ ఇవ్వడం లాంటి సీన్స్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేశారు. లాస్ట్ లో కుర్చీలో కూర్చొని టీ గ్లాస్ చేతిలో పట్టుకొని ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది అనే డైలాగ్ తో గ్లింప్స్ ని ఎండ్ చేశారు.

ఓ విధంగా ఈ ఫస్ట్ గ్లింప్స్ ద్వారా తే పవన్ కళ్యాణ్ నుంచి ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ లో పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు ఆడియన్స్ కి విజిల్స్ కొట్టించడంతో పాటు అటు జనసైనికులకి ఊపు తీసుకొచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ని కూడా చిత్రంలో పెట్టినట్లు అర్ధమవుతోంది. ఇక గ్లింప్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతోంది. దేవిశ్రీప్రసాద్ తన స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఉస్తాద్ కి ఊపు తీసుకొచ్చాడని గింప్స్ తోనే తెలుస్తోంది.

Ustaad Bhagat Singh First Glimpse | Pawan Kalyan | Sreeleela | Harish Shankar | Devi Sri Prasad