నెట్టింట్‌ వైరల్‌గా కంగువా పోస్టర్లు!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటిస్తోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా కంగువ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్‌ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌ వీడియో, కంగువ పోస్టర్లు నెట్టింట వైరల్‌ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇప్పటికే పొంగళ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్‌ ఉండటం చూడొచ్చు.

ముందుగా ప్రకటించిన ప్రకారం కంగువ సెకండ్‌ లుక్‌ విడుదల చేశారు. సెకండ్‌ లుక్‌లో ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తుండగా.. మరోవైపు స్టైలిష్‌ లుక్‌లో మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా మెస్మరైజ్‌ చేస్తున్నాడు సూర్య. కంగువలో దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. బాబీడియోల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

స్టూడియో గ్రీన్‌`యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 3డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. సూర్యకు బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్స్‌ అందించిన రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ కంగువ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే సూర్య.. కంగువ కోసం నా చివరి షాట్‌ పూర్తయింది.

కంగువ నాకు చాలా ప్రత్యేకం. మిమ్మల్ని అందరికీ స్క్రీన్‌పై చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ట్వీట్‌ చేసి ్గªనైల్‌ అప్‌డేట్‌ అందించాడని తెలిసిందే. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్‌ డేట్‌పై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.