ఆ ఐటెం భామకు 190 కోట్ల ఇళ్లా?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చేసే దీపికా పదుకునే ఏడాదిగా తన బ్రాండ్ ఇమేజ్ తో సినిమాలు అండార్స్మెంట్స్ చేస్తూ ఏడాదికి 300 కోట్లు సంపాదిస్తోంది. ఇండియాలో హైయెస్ట్ గా సంపాదించే బ్యూటీ అంటే దీపికా పదుకునే అని చెప్పాలి. అదే దీపికా పదుకునే తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి కొన్న ఇంటి ఖరీదు 119 కోట్లు. ఇదే చాలా పెద్ద ఎమౌంట్ అని చెప్పాలి.

కాని బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కాస్తా పాపులర్ అవుతూ ఎక్కువగా ఐటెం సాంగ్స్ ద్వారానే గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా. ఈ అమ్మడు బ్రాండ్ వేల్యూ ప్రకారం ఏడాదికి 66 కోట్ల వరకు సంపాదిస్తోంది. అయితే కెరియర్ పరంగా చూసుకుంటే అంత స్పీడ్ అయితే ఏమీ లేదు. ఎక్కువగా ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తోంది.

తెలుగులో వాల్తేర్ వీరయ్య, ఏజెంట్ సినిమాలలో ఇప్పటికే ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు రామ్ పోతినేని మూవీలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. ఇక హిందీలో కూడా హీరోయిన్ గా అయితే అవకాశాలు చేతిలో లేవు. కాని ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 190 కోట్లు పెట్టి ముంబైలో ఖరీదైన భవనం కొనుగోలు చేసిందంట. ఓ విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ హౌస్ ఇదే అని చెప్పాలి.

అయితే 190 కోట్లు పెట్టి ఇళ్ళు కోనేంత సామర్ధ్యం అయితే ఈమెకి లేదనే మాట వినిపిస్తోంది. ఆమె నెట్ వర్త్ ప్రకారం చూసుకున్న ఈ స్థాయిలో బడ్జెట్ హౌస్ కొనాలంటే నాలుగేళ్ళు ప్రతి రూపాయి సేవ్ చేస్తూ కొనుగోలు చేయాలి. అది అంత పెట్టి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుందా అనే ప్రశ్న వస్తోంది. సినిమాలు లేకుండా కేవలం ఐటెం గర్ల్ గా ఇంత భారీగా సంపాదించే స్థాయిలో ఊర్వశీ రౌతేలా ఇమేజ్ ఉందా అనే టాక్ నడుస్తోంది.

అయితే కేవలం ప్రచారం కోసం మాత్రమే ఊర్వశీ రౌతేలా ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉంటుందని బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఊర్వశీకి అంత సీన్ లేదని అంటున్నారు. కేవలం తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే 190 కోట్లు పెట్టి ఇళ్ళు కొన్నట్లు చెబుతుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.