ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసే నటిగా బాగా పేరు తెచ్చుకుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి పక్కన ‘బాస్ పార్టీ’ డాన్సులు చేస్తూ అలరించింది. అలాగే యువ కథానాయకుడు అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ సినిమాలో కూడా ఒక స్పెష ల్ సాంగ్ లో నటించింది. ఆ తరువాత ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన, ‘స్కంద’ సినిమాలో రామ్ పోతినేనితో డాన్సులు చేసి ఊర్వశి తాను ఇలాంటి సాంగ్స్ కి స్పెషలిస్ట్ అనిపించుకుంది.
ఊర్వశి ఈమధ్య వార్తల్లో కూడా వుంది. అహమ్మదాబాదులో జరిగిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఎంతో విలువైన, ఖరీదైన తన బంగారు ఫోనును పోగొట్టుకుంది. అదెవరికో దొరికింది కానీ ఇంకా అది ఊర్వశి చేతికి వచ్చిందో లేదో తెలియదు.
బాలీవుడ్ సుందరి ఈ వార్తని ఆమె సాంఫీుక మాధ్యమంలో పెట్టడం తరువాయి, అది వెంటనే వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా, ఊర్వశి రౌతేలా ఏది చేసినా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె ఒక అవుట్ ఫిట్ వేసుకున్నా, అది ఎక్కడ కొనింది, ఎవరు డిజైన్ చేశారు, దాని విలువ ఎంత ఇలాంటి వార్తలతో వైరల్ అవుతూ ఉంటుంది.
అలాగే తన అవుట్ ఫైట్స్ తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ దసరా నవరాత్రి పండగ సందర్భంగా ఆమె భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయానికి నిజమైన స్వరూపమైన చోళీ ఘఘ్రా రూపాన్ని అలంకరించింది. అన్నూ క్రియేషన్‌చే డిజైన్ చెయ్యబడిన ఆ అవుట్ ఫిట్, అలాగే ఆమె ధరించే ఆభరణాలు ఊర్వశి కి మరింత అందాన్ని ఇచ్చాయి. ఇంతకీ ఆమె వేసుకునే ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా, రూ. 5 లక్షలు, అవును అక్షరాలా అయిదు లక్షల రూపాయలు.