చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఫిబ్రవరి 12 న విడుదల అయింది.
విడుదలవ్వక ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను మించి సరికొత్త రికార్డులతో దుమ్ము లేపింది. చెప్పాలంటే ఉప్పెన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్న అంచనాలను అన్నీ మించేసి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిందని అంటున్నారు. అంతేకాదు తొలిరోజు ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఇండియా లోనే డెబ్యూ హీరోల పరంగా బిగ్గెస్ట్ షేర్ ని సొంతం చేసుకుంది.
తాజాగా డే 1 ప్రపంచవ్యాప్తంగా షేర్ల వివరాలు వెల్లడయ్యాయి. డే వన్ ఈ చిత్రం 10.42 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది. ఇంతకుముందు అఖిల్ మూవీ డెబ్యూ రికార్డుల్ని కూడా బ్రేక్ చేసింది. ఉత్తమ డెబ్యూ ఓపెనింగుల హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డులకెక్కాడు. ప్రాంతాల వారీగా ఉప్పెన షేర్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం-3.08 కోట్లు.. వైజాగ్- 1.43 కోట్లు.. తూ.గో జిల్లా- 0.98 కోట్లు .. ప.గో జిల్లా- 0.81 కోట్లు.. కృష్ణ 0.62 కోట్లు .. గుంటూరు 0.65 కోట్లు.. నెల్లూరు 0.35 కోట్లు.. వసూలు చేసింది. టోటల్ ఆంధ్రా నుంచి 4.87 కోట్ల షేర్ వసూలైంది. సీడెడ్ నుంచి 1.35 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం- ఆంధ్రా మొత్తం 9.3 కోట్ల షేర్ వసూలు కాగా.. విదేశాల నుంచి 34 లక్షలు.. కర్ణాటక నుంచి 52 లక్షలు.. టిఎన్ నుంచి 16 లక్షలు.. రెస్టాఫ్ ఇండియా 10లక్షలు వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు వెళ్లగా .. బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించడానికి సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.