‘ఉప్పెన’ లాంటి ట్విస్ట్.. రిస్క్ అంటున్నారే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఎవరికి ఏ స్థాయిలో నష్టం కలిగించిందో గాని మెగా అప్ కమింగ్ హీరో వైష్ణవ్ తేజ్ కు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మొదటి సినిమా రిలీజ్ టెన్షన్ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ సినిమా దర్శకుడు కూడా కొత్తవాడే. ఇక హీరోయిన్ కూడా మొదటి హిట్టు కోసం ఎదురుచూస్తోంది. సినిమా హిట్టయితే మరో సినిమాతో కొత్త స్టూడెంట్స్ కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు. సుకుమార్.

ఒక విధంగా ఉప్పెన సినిమా చాలా మందిని కన్ఫ్యూజన్ లో పడేసింది. జనవరి కానుకగా వస్తోంది అనుకుంటే పోటీ ఎక్కువయ్యిందని సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఇక చిత్ర యూనిట్ కు రిలీజ్ టెన్షన్ తో పాటు మరొక టెన్షన్ కూడా ఉందట. ఇప్పటివరకు ఏ సినిమాలో లేనటువంటి ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుందనే టాక్ వస్తోంది. హీరోకు విలన్ కు కలిగించే నష్టమే సినిమాలో ఊహించని విదంగా ఉంటుందట. అది క్లిక్కయితేనే సినిమా జనాల్లోకి ఎక్కుతుందనే రూమర్స్ వస్తున్నాయి.

సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా భయంకరమైన పాత్రలో అతను విలనిజాని చూపించనున్నట్లు తెలుస్తోంది. బహుశా సుకుమార్ కుమారి 21F చివర్లో ఉండే ఎమోషనల్ ట్విస్ట్ లాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే డౌట్ వస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ పై సుకుమార్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు సమాచారం. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.