నాగచైతన్య పై ప్రశంసలు కురిపించిన ఉప్పెన బ్యూటీ.. పోస్ట్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి మరోసారి జతకట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈమె నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు ఈ క్రమంలోనే కస్టడీ సినిమా ద్వారా మరోసారి వీరిద్దరూ సందడి చేయబోతున్నారు. ఇక నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే కృతి శెట్టి సైతం నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తనపై ప్రశంశల వర్షం కురిపించింది.

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే అది ముందు నీ నుంచే మొదలవ్వాలి. అనే సూక్తికి మీరే సరైన ఉదాహరణ. నా జీవితంలో కలిసిన గొప్ప వ్యక్తులలో మీరు ఒకరు.మీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను కస్టడీ పోస్టర్ చాలా గంభీరంగా కనిపిస్తుంది. అంటూ ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తనపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.