Upendra : ఆర్జీవి తో ఉపేంద్ర మరో బయోపిక్ తో రెడీ…

 

Upendra:రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, సామాజిక మధ్యమాలలో పోస్ట్ లు పెట్టి మరింత ప్రాచుర్యం పొందుతున్నారు.నాగార్జునతో ‘ఆఫీసర్’ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలలో స్టార్ పవర్, కంటెంట్ కనిపించట్లేదనే చెప్పాలి. రాంగోపాల్ వర్మ బయోపిక్ లు తీయడంలో మాత్రం ఆరితేరిపోయాడు.RGV ఎట్టకేలకు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన ఉపేంద్రను ఎంచుకున్నాడు.

ఉపేంద్ర అంటేనే విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఆర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించి రెండు గ్లింప్స్ లను రిలీజ్ చేశారు వర్మ. ఈ సినిమాలో ఉపేంద్ర బెంగళూరు నగరాన్ని మాత్రమే కాకుండా ముంబైలోని మాఫియాను, దుబాయ్‌లోని డి కంపెనీని కూడా భయపెట్టే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలోని తన హీరో పాత్ర గురించి చెప్తూ,ఈ సినిమాలో హీరో అత్యంత ధైర్యవంతుడు ఇంకా ఒక సక్సెస్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అని ఆర్ జి వి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆర్ జి వి తెలియజేశారు.ఈ చిత్రానికి ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఈ సినిమా ద్వారా ఆయన ఆర్ జీ వి తన అభిమానులు కోరుకున్న కంటెంట్ అందించి, పాత ఇమేజ్ ను సంపాదించుకుంటాడు ఏమో చూడాలి.