Upendra:’లహరి’ సంస్థతో ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా..?

Upendra: విలక్షణమైన సినిమాలకు,విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రస్ ఓపెన్గానే చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా రైటింగ్ డైరెక్షన్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఉపేంద్ర కథలు అంటే ఎలా ఉంటాయి అనేది ఉపేంద్ర, రా సినిమాలు చూస్తే అర్థమైపోతుంది.  ఇటీవల తెలుగులో కొన్ని చిత్రాలకు కీలక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ సినిమాలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఉపేంద్ర నుంచి మరొక పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చింది.ప్రముఖ ఆడియో లేబుల్ లహరి సంస్థ ఈ సినిమా కోసం నిర్మాణం రంగంలో అడుగుపెడుతుంది. వీనస్ ఎంటర్‌టైనర్స్ తో కలసి ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా నిర్మాణం జరుగుతుంది.ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. ఈ చిత్రంలో నటించడంతో పాటు ఉపేంద్రనే దర్శకత్వం బాద్యతలు తీసుకున్నారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపుదిద్దుకుంటుంది.

లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ దానికి ‘యు’ అనే టైటిల్ ఖరారు చేశారు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర లుక్ భయంకరంగా ఉంది. స్మశానంలా తలపిస్తున్న ప్రాంతంలో కొమ్ములు తిరిగిన గుర్రంపై భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు ఉపేంద్ర. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోకి ను నిర్మించాలని లహరి సంస్థ భావిస్తోంది. ఈ సినిమాతో ఉపేంద్ర ఎలాంటి వెరైటీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాడో చూడాలి.