Hero Suriya: అనుకోకుండా వచ్చి.. అగ్ర నటుడిని అయ్యా: హీరో సూర్య

Hero Suriya: భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో సూర్య. ఆయన సినిమా వస్తుందంటే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సందడి నెలకొంటుంది. ఈ స్టార్‌ హీరో చిత్ర పరిశ్రమ ఎంట్రీకి సంబంధించి గల కారణాన్ని వివరించారు. తన తల్లి తీసుకున్న బ్యాంక్‌లోన్‌ తీర్చాలని పరిశ్రమకు వచ్చినట్లు వెల్లడించారు. చదువు అయిపోగానే ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మొదట 15 రోజులకు రూ.750 ఇచ్చారు.

మూడు సంవత్సరాల తర్వాత నెలకు రూ.8000 చేశారు. ఏదో ఒకరోజు సొంతంగా కంపెనీ పెట్టాలని అనుకున్నాను. ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా నాన్నకు తెలియకుండా అమ్మ బ్యాంక్‌లో రూ.25వేలు లోన్‌ తీసుకున్నట్లు నాతో చెప్పింది. ఆలోన్‌ తీర్చడం కోసమే మణిరత్నం సినిమాలో అవకాశం రాగానే అంగీకరించా.

#Suriya45: సూర్య, #’సూర్య 45′ అనౌన్స్‌మెంట్

నేను చిత్ర పరిశ్రమలోకి రావాలని, నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు రూ.25వేలు ఇచ్చేసి.. ‘విూ లోన్‌ అయిపోయింది. ఇక బాధపడొద్దు’ అని చెప్పేద్దామనుకున్నా.. దాని కోసం నా కెరీర్‌ ప్రారంభించా.. ఇప్పుడు సూర్యగా (Hero Suriya) ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నా అని సూర్య చెప్పారు. 1997లో విడుదలైన ‘ఓ నెర్రుక్కు నెర్‌’ అనే తమిళ సినిమా ద్వారా సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వసంత్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మణిరత్నం నిర్మించారు.

ఇందులో విజయ్‌ హీరోగా నటించగా సూర్య కీలకపాత్రలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత సూర్య వరుస అవకాశాలు అందుకొని స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సూర్య నటించిన ‘కంగువా’ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Suriya44: సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, #Suriya44 షూటింగ్ పూర్తి

ఇటీవల ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ.. ‘కంగువా’ (Kanguva) స్క్రిప్టును డైరెక్టర్‌ శివ చెప్పినప్పుడే నేను కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నా అని అనిపించింది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలు ఇప్పటికే చూశాం. ఆ విషయంలో కోలీవుడ్‌లో ‘కంగువా’తో మేం తొలి అడుగేశాం అనుకుంటున్నా. తమిళ్‌లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు” అని తెలిపారు.

Public Reaction On YS Jagan & Sharmila Property War || Chandrababu || Pawan Kalyan || Telugu Rajyam