స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలో అశేష ప్రేక్షకాదరణ పొందాడు. తెలుగు భాషలోనే కాక అతనికి వివిధ భాషలలోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమా ఇప్పుడు తమిళం, మలయాళ భాషలలో దూసుకుపోతున్నాయి. అయితే లాక్‌డౌన్ తర్వాత తన తాజా చిత్రం పుష్ప షూటింగ్ మొదలు పెట్టిన బన్నీ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. టీంలో ఉన్న ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలియగానే షూటింగ్‌కు బ్రేక్ వేశారు.
ఇక నిహారిక, చైతన్య పెళ్లి కోసం స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయ్ పూర్ వెళ్ళిన బన్నీ అక్కడి అధికారుల మనసులు గెలుచుకున్నారు. ఉదయ్‌పూర్‌లోని హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన నిహారిక, చైతన్య పెళ్లిలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయన కోవిడ్ నిబంధనలను తూచా తప్పక పాటించారట. ఎంతో క్రమశిక్షణతో ఆయన పాటించిన తీరు ఎయిర్ పోర్ట్ అధికారులని సైతం విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్‌లో బన్నీతో కలిసి దిగిన అధికారిణి ఫొటోని షేర్ చేస్తూ..ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని మేం కోరుకుంటాం. ఇలాంటి సమయంలో వారు కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండటానికి సాయపడతాం. మాస్క్‌లు ధరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు
ఉదయ్ పూర్‌లో బన్నీకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. అక్కడ బన్నీ స్టే చేసిన హోటల్‌లో హిట్ సినిమా టైటిల్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్స్‌ని గదిలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని స్నేహ రెడ్డి తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక అన్నీ పనులు పూర్తి చేసుకున్న బన్నీ ఇప్పుడు సినిమాతో బిజీ కానున్నాడు.