ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఎమోషనల్ అయిన ఉదయభాను..

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి యాంకర్ ఉదయభాను గురించి అందరికీ పరిచయమే. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో సందడి చేసింది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వగా మళ్లీ ఈమధ్యే పలు ఈవెంట్లలో కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా తను ఎమోషనల్ అయ్యింది. కారణమేంటంటే.. తాను యూట్యూబ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది.

పైగా ఒక వీడియోతో ఎమోషనల్ అయ్యింది.. మీ ప్రేమే నా బలం.. మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమే నిలిచింది మీరే అంటూ మరికొన్ని మాటలతో ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటూ మీ ముందుకు వస్తున్న అంటూ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.