ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు రెబల్ స్టార్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన అలనాటి సీనియర్ నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 180 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాదంతో నిండిపోయింది. ఇదిలా ఉండగా కృష్ణంరాజుకి వారసులు లేకపోవడంతో తన సోదరుడి కుమారుడైన ప్రభాస్ ని ఇండస్ట్రీలో వారసుడిగా నిలబెట్టాడు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా మారిన ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.

బాహుబలి వంటి సినిమాలలో నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. అయితే ఇటీవల తన పెదనాన్న మరణించడంతో ప్రభాస్ కూడా తీవ్ర శోకం మునిగిపోయాడు. కృష్ణంరాజు చివరి సమయంలో కూడా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించి నిజమైన వారసుడని నిరూపించుకున్నాడు. ఇలా పెదనాన్న, కొడుకు ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో మంచి హీరోలుగా గుర్తింపు పొంది ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రెండు మూడు సినిమాలలో కూడా నటించారు. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ అభిమానులు ఇటీవల వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించారు.

ఈ వీడియోలో ఒకవైపు కృష్ణంరాజు నటించిన సన్నివేశాలను మరొకవైపు ప్రభాస్ నటించిన సన్నివేశాలను కలిపి ఒక వీడియో ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఏం ఎడిటింగ్ రా బాబు అంటూ మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది అచ్చం పెదనాన్న మేనరిజం అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో రెబెల్ స్టార్ అభిమానులను మాత్రమే కాకుండా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా లవ్ సింబల్ తో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.