క్రేజీ గాసిప్ : ఒకేరోజు రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా టీజర్లు..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ లో రానున్న చిత్రాల్లో అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ చిత్రాలు ఉండగా వీటితో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ నటించిన వరుస చిత్రాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి.

ఒకప్పుడు షారుక్ పరిస్థితి కూడా ఇదే కానీ ఈ ఏడాది వచ్చిన తన “పఠాన్” సినిమాతో మైండ్ బ్లాకింగ్ హిట్ ని అందుకోగా బాలీవుడ్ బాక్సాఫీస్ అయితే షారుక్ దెబ్బతో దద్దరిల్లింది. ఇక దీనితో నెక్స్ట్ తాను చేస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “జవాన్” కోసం పఠాన్ ని మించిన హైప్ నెలకొంది.

దీనితో ఈ సినిమా టీజర్ కి కూడా సెన్సేషనల్ హైప్ ఉండగా మరో పక్క అయితే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ “సలార్” పై హైప్ అయితే జవాన్ కి మించి ఉంది. పైగా తెలుగు సహా హిందీలో కూడా మరింత స్థాయిలో ఉండడంతో సలార్ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇలాంటి ఒక రెండు క్రేజీ టీజర్ లు ఒకే రోజు వస్తే ఆ హై మూవీ లవర్స్ కి చెప్పలేని విధంగా ఉంటుంది. కాగా ఇప్పుడు ఆ బిగ్ డే సాధ్యం అయ్యేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల టీజర్ లు కూడా ఈ జూలై 7న రిలీజ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ బిగ్ మూమెంట్ సాధ్యం అవుతుందో లేదో చూడాల్సిందే.