షాకింగ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండు డిజప్పాయింటింగ్ న్యూస్ లు

ఇప్పుడు నో డౌట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో ఎదురు చూస్తున్న భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” అని అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్నా మొట్ట మొదటి సినిమా కావడం అది కూడా నెక్స్ట్ లెవెల్ ఏక్షన్ తో సినిమా తెరకెక్కడంతో హైప్ తరాల స్థాయిలో ఉంది.

కాగా ఈ సినిమాని మొదట అన్నీ అనుకున్నట్టుగా రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ గా వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు భారీ పోటీ అటు బాలీవుడ్ సహా హాలీవుడ్ నుంచి కూడా ఎదురు కావడంతో యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్స్ చేతులెత్తేస్తున్నారు. మొదటి నుంచి అయితే ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ చేయనన్ని రికార్డు లొకేషన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు.

కానీ అనూహ్యంగా రిలీజ్ వాయిదా చేసేసరికి ఇప్పుడు ఆ రిలీజ్ లొకేషన్స్ పడిపోయాయి. మొదట 1900 పైగా లొకేషన్స్ లో ప్లాన్ చేసి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఇందులో దాదాపు సగానికి కోత పడినట్టుగా తెలుస్తుంది. కానీ తాము అనుకున్న రేంజ్ లో సినిమా రిలీజ్ కాకపోయినా బిగ్గెస్ట్ రిలీజ్ కే తాము ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

ఇక ఇదే ఒక షాకింగ్ న్యూస్ అనుకుంటే ఇంకో న్యూస్ ఏమిటంటే ఈ చిత్రం యూఎస్ లో అసలు ఐమ్యాక్స్ రిలీజ్ కూడా లేనట్టు తెలిపారు. ఇది పెద్ద డిజప్పాయింట్ అని చెప్పాలి. చాలా మంది బిగ్ స్క్రీన్స్ లో చూడాలి అనుకున్నారు కానీ ఒక్క స్క్రీన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవడం గమనార్హం. దీనితో యూఎస్ రెబల్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు.