ట్విట్టర్ రివ్యూ : “కబ్జా” సినిమా ఎలా ఉందో చూడండి!

మళ్ళీ చాలా కాలం తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ సినిమా చాలా అంచనాలు మధ్య అయితే రిలీజ్ కి వచ్చింది. ఆ సినిమానే “కబ్జా”. అయితే ఈ సినిమా టీజర్ తో తెచ్చుకున్న హైప్ ని ఇప్పటికీ కొనసాగించి ఉంటే మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టి ఉండేది.

స్టార్ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లాంటి బిగ్ స్టార్స్ నటించిన ఈ సినిమాని దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. మరి ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో పడిపోయింది. అయితే ఆల్రెడీ ట్విట్టర్ లో సినిమా చూసిన ప్రజానీకం రివ్యూస్ పడిపోతున్నాయి.

కాగా ఈ సినిమా విషయంలో మరీ అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఎక్కడా పెద్దగా కనిపించడం లేదని చెప్పాలి. కేజీఎఫ్ రేంజ్ లో ట్రీట్ ఇచ్చే సినిమా అయితే ఇది కాదని తేల్చేస్తున్నారు. కానీ కొంతమంది అయితే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ బాగా ఎక్కుతాయని వాటిలో సుదీప్ ఎంట్రీ అదిరిపోయింది అని అంటున్నారు.

దీనితో ఇవి బాగున్నాయట. కానీ ఓవరాల్ గా సినిమా మరీ అంత రేంజ్ లో నచ్చేలా లేదని నెటిజన్స్ అంటున్నారు.  కానీ కన్నడ ఆఫ్ లైన్ లో ఆడియెన్స్ రివ్యూస్ మాత్రం వేరేలా ఉన్నాయి. సినిమా బానే ఉందని పాజిటివ్ రెస్పాన్స్ గట్టిగా వినిపిస్తున్నారు. దీనితో అయితే ఈ సినిమాకి ప్రస్తుతం మిక్సిడ్ గానే రెస్పాన్స్ ఉంది. మరి ఫైనల్ గా సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.