ట్విట్టర్ రివ్యూ : “ఆదిపురుష్” హిట్టా? ఫట్టా??

పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అయితే పూర్తిగా బాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ తో అయితే చేసిన భారీ ఇతిహాస చిత్రమే “ఆదిపురుష్”. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా సాయి అలీఖాన్ రావణ పాత్రలో అయితే నటించాడు.

మరి ఈ భారీ సినిమా రిలీజ్ ఈరోజు ఎట్టకేలకు రాగా ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలు అందుకుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు ట్విట్టర్ ద్వారా తెలుస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీమియర్స్ తో షో పడిపోయిన ఈ చిత్రం టాక్ మిక్సిడ్ గా ఉందని చెప్పాలి. అయితే ఫస్టాఫ్ కంటే కూడా సెకండాఫ్ బెటర్ గా ఉందని చాలా మంది అంటున్నారు.

ఇక మొదటి నుంచి భయపడిన విషయం సినిమాలో నిజమే అయ్యిందట. టీజర్ లో బొమ్మలు లాంటి యానిమేషన్ చూసిన ఆడియెన్స్ ట్రైలర్ తో తేరుకున్నారు కానీ సినిమాలో మాత్రం ఇవి పూర్తి స్థాయి నాచురల్ గా లేవట. సినిమాలో కూడా చాలా సీన్స్ లో దారుణమైన గ్రాఫిక్స్ కనిపించాయని అంటున్నారు.

ఇక సినిమా రన్ టైం బాగా పెద్దది కాగా అక్కడక్కడా కాస్త బోర్ కొట్టవచ్చట. ఇక ప్రభాస్ పై కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాను అంత పర్ఫెక్ట్ గా సూట్ అవ్వలేదని అంటున్నారు. అలాగే సినిమాలో కొన్ని అంశాలు కొత్తగా ట్రై చేయగా కొన్ని అంశాలు ట్రోల్ మెటీరియల్ గా అనిపించాయని అంటున్నారు.

ఇక దర్శకుడు ఓంరౌత్ అయితే విజువల్స్ పరంగా అలాగే ఎమోషన్స్ పరంగా ఇంకా జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అని సినిమా చూసిన నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి అయితే భారీ విజువల్స్ తో గ్రాండ్ ఫీస్ట్ ఇస్తుంది అనుకున్న ఈ సినిమా విజువల్స్ పరంగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. మరి రామాయణం ఏమన్నా ఎమోషన్ వర్కౌట్ అయితే మాత్రం సినిమాకి మంచి రన్ దక్కవచ్చు. 


https://twitter.com/AhmedSrkMan2/status/1669441301908180992?s=20 
https://twitter.com/mr_KP_/status/1669394375754014720?s=20