మ‌రోసారి కేసీఆర్‌ని క‌లిసి చిరు, నాగ్.. శుభవార్త చెప్పిన ముఖ్య‌మంత్రి

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన క‌ష్ట‌న‌ష్టాల‌ని చ‌ర్చించేందుకు చిరంజీవి, కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు వ‌ర‌ద‌ల‌కు సంబంధించి రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిచ‌డంతో పాటు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఇక ఈ రోజు మ‌రోసారి చిరు, నాగ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కేసీఆర్‌ని క‌లిసి కోవిడ్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన సినీ కార్మికుల‌ని ఆదుకోవాల‌ని అన్నారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం పూడ్చాల‌ని తెలిపారు

ప్రముఖుల విజ్క్ష‌ప్తిని స్వీక‌రిచిన కేసీఆర్ తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా రాయితీలు, మిన‌హాయింపులు ఇస్తామ‌ని చెప్పారు.రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లి రావ‌డానికి ఎంతో కృషి చేస్తున్న ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మను ఆదుకోదా? ముంబై, చెన్నైతో పాటు హైద‌రాబాద్‌లోను పెద్ద సినీ ప‌రిశ్ర‌మ ఉంది. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. కోవిడ్ వ‌ల‌న న‌ష్ట‌పోయిన కార్మికులని కాపాడుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని కేసీఆర్ అన్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. త్వ‌ర‌లో చిరంజీవి ఇంట్లో మ‌రో సారి దీనిపై చ‌ర్చించి సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి ఎలాంటి కృషి చేయాల‌నే దానిపై ప్లాన్‌ని సిద్దం చేస్తామ‌ని అంటున్నారు.