చంద్రయాన్ 3..”ఆదిపురుష్” మళ్ళీ స్టార్టైన రచ్చ..!

ఇపుడు భారతీయులు అంతా కూడా ఎంతో గర్వంగా తలెత్తుకునే రోజు వచ్చింది. మన దేశపు స్పేస్ రీసెర్చ్ సంస్థ నుంచి ప్రయోగాత్మకంగా పంపించిన “చంద్రయాన్ 3” నిన్న అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగా దానిపై ఇపుడు ప్రపంచమే దాసోహం అంటుంది.

అయితే మరి నేషనల్ ప్రాజెక్ట్ అయ్యిన దీనికి అలాగే పాన్ ఇండియా చిత్రం అయినటువంటి “ఆదిపురుష్” చిత్రానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? లింక్ ఉంది. గతంలో కూడా ఓసారి చంద్రయాన్ 3 కి ఆదిపురుష్ విషయంలో కూడా ఏకంగా నేషనల్ లెవెల్లో ట్రోల్స్ వచ్చాయి.

అయితే ఇది ప్రభాస్ మీద అక్కసుతోనా లేక అలాంటి సినిమా కోసం ఇంత బడ్జెట్ వేస్ట్ చేస్తున్నారనా లేక మరేమో కానీ గతంలో ఆదిపురుష్ కి 600 కోట్ల బడ్జెట్ పెడితే ఇదే బడ్జెట్ తో చంద్రయాన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అని ఆ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వేయగా ప్రభాస్ ఫ్యాన్స్ డిఫెండ్ చేశారు.

అయితే ఇపుడు మళ్ళీ ఇదే విధంగా చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాక అదే ట్రోలింగ్ బ్యాచ్ ఆదిపురుష్ బడ్జెట్ ని 700 కోట్లు చేసి ఇప్పుడు మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి చెత్త గ్రాఫిక్ సినిమాలు మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా జాతికి ఉపయోగపడే ఈ తరహా ప్రాజెక్ట్ లు మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటూ కొందరు కుహనా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు.

దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కావాలని నెగటివ్ చేయడానికి కాకపోతే ముందు ఆదిపురుష్ కి ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి అప్పుడు రండి మాట్లాడుకుందాం అని సోషల్ మీడియాలో అంటున్నారు. దీనితో ఇపుడు సోషల్ మీడియాలో చంద్రయాన్ 2 కి ఆదిపురుష్ విషయంలో ఇలా రచ్చ నడుస్తుంది.