“ఆదిపురుష్” విషయంలో ఈ ట్రోల్స్ అవసరమా??

పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ విజువల్స్ చిత్రం “ఆదిపురుష్” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ చిత్రం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇప్పుడు సిద్ధం అవుతుండగా మేకర్స్ అయితే తాము తెరకెక్కించిన పవిత్ర రామాయణాన్ని మరింత పవిత్రంగా మలిచే విధంగా ఇంట్రెస్టింగ్ మూవ్స్ తీసుకున్నారు.

అయితే కొందరు రామాయణాన్ని ఇతిహాసం అంటారు కొందరు మన దేశపు చరిత్ర అంటారు. అయితే ఇతిహాసం కన్నా మన చరిత్రే అని ఇప్పటికీ పలు ఆధారాలు కూడా ఉన్నాయి. దీనితో ఈ సినిమా విషయంలో మాత్రం రామ భక్తులు చాలా ఖచ్చితంగా అయితే ఉంటారు.

ఇక దీనితో నిన్ననే మేకర్స్ రామునికి ప్రియ భక్తుడు అయినటువంటి ఆంజనేయుని కోసం అయితే తాము ప్రతి థియేటర్ లో భక్త ఆంజనేయ కోసం ఒక సీటుని విక్రయించకుండా వదిలేస్తున్నామని అది ఆ హనుమంతునికి తాము  గౌరవ మర్యాద అని తెలిపారు.

అయితే ఇది ఒకరకంగా వారి ప్రేమని చాటే ప్రయత్నం అయితే దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తూ ఉండడం వాటిని షేర్ చేస్తుండడం కొందరికి వారిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కాని పరిస్థితి. వారేదో హనుమంతునిపై ఉన్న ఒక రకమైన నమ్మకంతో మంచి మూవ్ తీసుకుంటే దానిలో కూడా ట్రోల్స్ ఫన్ పోస్ట్ లు పెట్టడం మన దౌర్భాగ్యం అని కొందరు అంటున్నారు. మరి ఇలాంటి విషయాల్లో కూడా ఫన్ చేయడం అంత అవసరమా?