తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే లైగర్ సినిమాతో తన క్రేజ్ ను పక్క రాష్ట్రాల్లో కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు ఈ రౌడీ స్టార్. అయితే తనకు వచ్చిన క్రేజ్ ద్వారా విజయ్ సొంతంగా రౌడీ వేర్ బ్రాండ్ ను మార్కెట్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా అది ప్రముఖ బ్రాండ్ దుస్తులలో ఒకటిగా నిలిచింది. చాలా వరకు ఆ బ్రాండ్ రేట్లు మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళకే సెట్టయ్యే ధరలోనే ఉంటాయని బాగానే ప్రమోట్ చేశారు. కాకపోతే ఇటీవల ‘రౌడీ వేర్’ బ్రాండ్ డెనిమ్ జీన్స్, జాకెట్ యొక్క ధర తీవ్ర విమర్శలకు గురైంది. డెనిమ్ జాకెట్ ధర సుమారు రూ.25లు కాగా, డెనిమ్ జీన్స్ రూ.15వేలకు ట్యాగ్ తగిలించారు.
రేటు సంగతి పక్కన పెడితే అసలు ఆ డిజైనింగ్ ఏమిటి అని అందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మిగిలిపోయిన బట్ట ముక్కలతో కలిపి కుట్టేసినట్లు ఉందని సోషల్ మీడియాలో ఓ వర్గం వారు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఇక రేట్ ట్యాగ్ చూసి మధ్యతరగతి వాళ్ళు ఈ రేంజ్ లో కొంటారా అంటూ కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇదివరకు వచ్చిన కొన్ని డ్రెస్సులపై కూడా ట్రోలింగ్స్ గట్టిగానే రావడంతో విజయ్ అభిమానులు రౌడి వేర్ డిజైనర్ ను మార్చుకోవాలని సలహాలు ఇస్తున్నారు.