ప్రస్తుతం టెలివిజన్ విూడియా`సోషల్ విూడియాలో ట్రెండిరగ్ విషయం చంద్రయాన్`3 అన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన ఇస్రో గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ చంద్రయాన్` 3 బడ్జెట్ ఖర్చు కడా చర్చనీయాశంగా మారింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం రూ.615 కోట్ల బడ్జెట్‌తో చంద్రయాన్`3 కలను సాకారం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో కొంతమంది ట్రోలర్స్ ప్రభాస్ ఆదిపురుష్ ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
చంద్రయాన్ 3 బడ్జెట్ను ఆదిపురుష్‌తో పోలుస్తూ ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600`700కోట్లకు రూపొందిన ఆదిపురుష్ పేలవమైన కథ, విజువల్స్‌తో భారీ డిజాస్టర్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో విమర్శలను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు అలాంటి అనవసరమైన సినిమాలకు అంత ఖర్చు పెట్టడం కన్నా చంద్రయాన్ లాంటి వాటికి ఆ డబ్బులిస్తే ప్రగతికి ఉపయోగపడుతుందని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. రామాయణానికి మచ్చ తెచ్చే సినిమాల కన్నా సైన్స్ ఎక్స్ పెరిమెంట్లు నయమని అంటున్నారు. ఆదిపురుష్ కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర లిఖించారని, భారత జెండాను వినువీధుల్లో సగర్వంగా ఎగురవేశారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఈ రెండిటినీ పోల్చడం సరికాదంటూ మరికొందరు అంటున్నారు.