ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సెన్సేషనల్ ప్లాన్.!

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా తన భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో భారీ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో తారక్ నెక్స్ట్ సినిమా అయినటువంటి 30వ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 30 విషయంలో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మొదటగా ఎన్టీఆర్ కొరటాల సినిమా కన్నా ముందే తారక్ కెరీర్ లో 30వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అనౌన్స్ అయ్యింది. అప్పటికే వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ” చూసి ఈ కాంబినేషన్ అంటే ఆడియెన్స్ పిచ్చెక్కిపోయారు. దీనితో ఈ కాంబినేషన్ లో రెండో సినిమా కోసం ఎదురు చూడని వారు లేరు.

కాగా ఈ సినిమా అనౌన్స్ అయ్యి ఆగిపోయింది కానీ నిలిచిపోలేదని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవ్వడం వైరల్ గా మారింది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ భారీ పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేసారని ఆ మధ్య చెప్పారు కానీ ఇప్పుడు అసలు ఏ సినిమా అనుకున్నారో ఇప్పుడు రివీల్ చేశారు.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఓ భారీ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారట. ఇది మాత్రం ఊహించనిది అని చెప్పాలి. ఎన్టీఆర్ అన్నా నందమూరి ఫ్యామిలీ అన్నా పౌరాణిక జానర్ కి పెట్టింది పేరు అలాంటిది ఎన్టీఆర్ ని కూడా ఫుల్ లెంగ్త్ పౌరాణిక పాత్రలో ఎప్పుడో చిన్నపుడు చూసారు. 

మరి పురాణాలపై సాలిడ్ గ్రిప్ ఉన్న త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఎన్టీఆర్ తో ఆ తరహా సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనితో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై ఈ అప్డేట్ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది.