Thrivikram Srinivas: తన గురించి అలా మాట్లాడిన వారికి గట్టిగా సమాధానం చెప్పిన త్రివిక్రమ్!

Thrivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పవన్ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకుడు అయినప్పటికీ పేరుకు మాత్రమే అతని పేరు ఉందని మిగిలిన అన్ని వ్యవహారాలు త్రివిక్రమ్ చూసుకుంటున్నారని పెద్ద ఎత్తున అతని గురించి వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే ఇలా తన గురించి మాట్లాడిన వారందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్టిగా సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమా విషయంలో మొత్తం హడావుడి త్రివిక్రమ్ దే అని మాట్లాడిన వారందరికీ ఈ సినిమా రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ బాగా సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరైన ఆయన వేదికపైకి వెళ్లి సినిమా గురించి మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక అతిథి లాగా కూర్చుని ఉన్నారు తప్ప పైకి వెళ్లి సినిమా గురించి ఏ విధమైనటువంటి విషయాలు చెప్పలేదు.

కొన్ని వెబ్ సైట్స్ త్రివిక్రమ్‌ పై సెటైరికల్ స్టోరీస్ రాయగా, ఆయన మాత్రం వారందరని చెంపమీద కొట్టినట్టుగా వ్యవహరించాడు. ఇలా తన గురించి మాట్లాడిన వారికి ఈ సందర్భంగా సమాధానం చెప్పారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నారు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.